ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతి చర్చలకు సిద్ధమే, కానీ... : రష్యా

ABN, First Publish Date - 2022-03-03T23:09:45+05:30

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమేనని, అయితే ఆ దేశ సైనిక స్థావరాలు, మౌలిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమేనని, అయితే ఆ దేశ సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడాన్ని ఆపబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ గురువారం చెప్పారు. బుధవారం రాత్రి ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు జరగవలసి ఉంది. కానీ ముందుగా దాడులను ఆపాలని రష్యాకు ఉక్రెయిన్ షరతు విధించడంతో చర్చలు రద్దయ్యాయి. 


ఉక్రెయిన్‌ ముందు కొన్ని డిమాండ్లను పెట్టి, స్పందన కోసం రష్యా ఎదురు చూస్తోంది. తన వల్ల సైనిక ముప్పు ఉండబోదనే నిబంధనను చర్చల ఎజెండాలో ఉక్రెయిన్ పెట్టాలని రష్యా కోరింది. అణు యుద్ధం గురించి ఆలోచనలు పాశ్చాత్య దేశాల రాజకీయ నాయకుల మనసుల్లో గింగిరాలు తిరుగుతున్నాయన్నారు. ఆ ఆలోచనలు రష్యన్ల మనసుల్లో లేవన్నారు. ఆయన రష్యన్, ఫారిన్ మీడియాకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యాలో నిరసన వ్యక్తమవుతోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పదుల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 


మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. యుద్ధం తర్వాత తన దేశాన్ని పునర్నిర్మిస్తానని శపథం చేశారు. తమ దేశానికి రష్యా వల్ల జరిగిన నష్టాలన్నిటినీ ఆ దేశం భర్తీ చేస్తుందన్నారు. 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్‌లో రష్యా సేనలు పెద్ద ఎత్తున బాంబులను కురిపిస్తున్నాయి. ఖెర్సోన్ నగరం రష్యా దళాల వశమైంది. ఖెర్సోన్ వ్యూహాత్మక ప్రాధాన్యంగల నగరం. 


ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తోంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ బుధవారం భారీ మెజారిటీతో ఆమోదించిన తీర్మానంలో రష్యా తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపాలని కోరింది. 


Updated Date - 2022-03-03T23:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising