ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందీని రుద్దాలని చూస్తే..: సీఎం స్టాలిన్

ABN, First Publish Date - 2022-01-26T16:33:14+05:30

తమిళ భాష కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్రంలో డీఎంకే యువ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ ద్వారా సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. ‘‘1938లో తమిళ భాష పరిరక్షణ ఉద్యమాన్ని పెరియార్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తాము హిందీకి వ్యతిరేకం కాదని, కానీ బలవంతంగా అమలు చేయాలని చూస్తే వ్యతిరేకించక తప్పదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఎవరి భాష పట్ల వారికి ప్రేమ, గౌరవం ఉంటాయని, తమ భాషను కాపాడుకోవడానికి ఇతర భాషలను తమ పరిధిలోకి రాకుండా చూసుకోవడంలో తప్పేం లేదని ఆయన అన్నారు. తమిళులు తమ భాషను కాపాడుకోవడానికి హిందీని వ్యతిరేకించడం తప్పుగా భావించరాదని, అలా భావిస్తే అది సంకుచిత మనస్తత్వం అవుతుందని స్టాలిన్ అన్నారు.


తమిళ భాష కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్రంలో డీఎంకే యువ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ ద్వారా సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. ‘‘1938లో తమిళ భాష పరిరక్షణ ఉద్యమాన్ని పెరియార్ ప్రారంభించారు. 2022లో నేటికి తమిళనాడు దానికి కట్టుబడి ఉంది. పెరియార్ ఆశయాలను ఆచరిస్తూ ఆయన చూపిన మార్గంలోనే నడుస్తోంది. మేము ఏ భాషకూ వ్యతిరేకం కాదు. కానీ బలవంతంగా మాపై హిందీని రుద్దాలని చూస్తే గట్టిగానే ప్రతిఘటిస్తాం’’ అని స్టాలిన్ అన్నారు.

Updated Date - 2022-01-26T16:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising