ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbaiలో భారీవర్షాలు...imd issued Orange alert

ABN, First Publish Date - 2022-07-01T16:37:34+05:30

ముంబయి నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తుండటంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి(మహారాష్ట్ర):ముంబయి నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీవర్షాల ప్రభావం వల్ల ముంబయి నగరం అంతటా రైలు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఈ సీజన్‌లో మొదటిసారి కురిసిన భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిందని మున్సిపల్ అధికారులు తెలిపారు.ముంబైలోని కుర్లా, చెంబూర్, సియోన్, దాదర్, అంధేరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.జులై 1, 2 తేదీల్లో ముంబయి నగరంలో పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది.


హింద్‌మాత, పరేల్, కాలాచౌకి, హాజీ అలీ, డాక్‌యార్డ్ రోడ్, గాంధీ మార్కెట్, బాంద్రా వంటి ప్రాంతాల్లో పలు రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.వరదల కారణంగా మున్సిపల్ అధికారులు పశ్చిమ శివారులోని అంధేరి సబ్‌వేని మూసివేశారు.పలు చోట్ల ప్రజలు మోకాళ్ల లోతు వరద నీరు నిలిచింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌ చిక్కుల్లో కూరుకుపోవడం కనిపించింది.ముంబయి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య, కల్బాదేవి, సియోన్ ప్రాంతాల్లో రెండు భవనాలు కూలి పోయాయి. 

Updated Date - 2022-07-01T16:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising