ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండిపోయాయి.. నీరు వదలొద్దు

ABN, First Publish Date - 2022-06-29T15:44:00+05:30

మరిన్ని జలాలు నిల్వ చేసేందుకు అవకాశం లేనందున జూలై 1వ తేదీ నుంచి కండలేరు రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను నిలిపివేయాలని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నిల్వ చేసేందుకు అవకాశం లేదు 

- 1 నుంచి కృష్ణా జలాలు ఆపండి ప్లీజ్‌ 

-  ఏపీకి రాష్ట్ర అధికారుల వినతి


చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మరిన్ని జలాలు నిల్వ చేసేందుకు అవకాశం లేనందున జూలై 1వ తేదీ నుంచి కండలేరు రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు సోమవారం లేఖ రాశారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా ఏపీ ప్రభుత్వం కండలేరు రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా మే 8వ తేదీ నుంచి 2.4 టీఎంసీలను విడుదల చేసింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట వద్ద రికార్డు స్థాయిలో 610 క్యూసెక్కుల నీరు నమోదైంది. దీంతో రాష్ట్ర అధికారులు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చెంబరంబాక్కం, రెడ్‌హిల్స్‌ రిజర్వాయర్లు ఇప్పటికే గణనీయంగా నిండాయని, అందువల్ల ఇకపై వచ్చే నీటిని నిల్వచేసే సామర్థ్యం లేనందున జూలై 1 నుంచి నీటిని విడుదల చేయవద్దని కోరారు.

Updated Date - 2022-06-29T15:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising