ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taiwan: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తైవాన్ చుట్టూ మోహరించిన చైనా: సైనిక పరాక్రమాన్ని చూపెడుతూ వీడియో విడుదల

ABN, First Publish Date - 2022-08-08T00:43:11+05:30

చైనా-తైవాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌పై తమకు సర్వ హక్కులు ఉన్నాయని భావిస్తున్న చైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనా-తైవాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌పై తమకు సర్వ హక్కులు ఉన్నాయని భావిస్తున్న చైనా.. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించి వెళ్లాక కోపంతో రగిలిపోతోంది. పెలోసీకి ఆతిథ్యమిచ్చిన తైవాన్‌ను శిక్షించాలని బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో అమెరికాకు కూడా బుద్ధి చెప్పాలని భావిస్తోంది.


ఇందులో భాగంగానే తేపే చుట్టూ మిలటరీ విన్యాసాలు ప్రారంభించింది. అది చూసిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు వెంటనే ఆ విన్యాసాలు కట్టిపెట్టాలని చైనాను కోరాయి. అయితే, బీజింగ్ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్టు తన సైనిక పరాక్రమాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రపంచానికి చూపించింది. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది.


చైనా ప్రభుత్వం మౌత్ పీస్ అయిన ‘గ్లోబల్ టైమ్స్’ ఈ వీడియోను షేర్ చేసింది. ‘‘తైవాన్ ద్వీపం చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) చేస్తున్న సైనిక విన్యాలకు సంబంధించిన వీడియో ఇది. 100కుపైగా యుద్ధ విమానాలను ప్రభుత్వం మోహరించింది. చైనా కొత్తతరం ఏరియల్ రిఫ్యూయలర్ YU-20 ఆవిష్కరించింది. అలాగే, పదికి పైగా డిస్ట్రాయెర్లు, యుద్ధ నౌకలు కలిసి ఉమ్మడిగా దిగ్బంధన విన్యాసాలు చేస్తున్నాయి’’ అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించింది.


ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా తైవాన్‌కు తీవ్ర హెచ్చరిక పంపింది. తైవాన్‌ను ఎలాగైనా సరే తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తున్న చైనా.. అవసరమైతే సైన్యాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో తైవాన్‌కు మద్దతిస్తున్న అమెరికా సహా ఇతర దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది.   



Updated Date - 2022-08-08T00:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising