Wang Wenbin : సరిహద్దుల్లో అంతా ప్రశాంతం
ABN, First Publish Date - 2022-12-14T01:19:36+05:30
భారత్‌తో సరిహద్దులు అంతా ప్రశాంతంగా ఉన్నాయని చైనా పేర్కొంది. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇరు పక్షాలు సైనిక, దౌత్య మార్గాల్లో సున్నితంగా సంభాషించుకున్నాయని తెలిపింది.
చైనా విదేశాంగ అధికార
ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్
బీజింగ్, డిసెంబరు 13: భారత్‌తో సరిహద్దులు అంతా ప్రశాంతంగా ఉన్నాయని చైనా పేర్కొంది. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇరు పక్షాలు సైనిక, దౌత్య మార్గాల్లో సున్నితంగా సంభాషించుకున్నాయని తెలిపింది. ఈ నెల 9న తవాంగ్ సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తేలిన నేపథ్యంలో మంగళవారం ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మీడియాతో మాట్లాడారు. అయితే, ఘర్షణలపై ఆయన ఇతర వివరాలేమీ వెల్లడించలేదు. ‘‘మాకు తెలిసినంతవరకు అంతా సాధారణంగా ఉంది. మీ ప్రశ్నల్లో కొన్నింటిని అడగాల్సినవారిని (రక్షణ శాఖ) అడగాలనేది నా సూచన. కీలక వ్యవహారాలపై కుదిరిన అవగాహన మేరకు భారత్ మాతో సామరస్య ధోరణిలో నడుచుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని వాంగ్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-14T01:19:37+05:30 IST