ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ శ్రేణుల కోసమే శేష జీవితం అంకితం

ABN, First Publish Date - 2022-03-08T14:09:17+05:30

అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీని కాపాడితీరుతానని ఆ పార్టీ బహిష్కృత నాయకు రాలు వీకే శశికళ శపథం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తూత్తుకుడి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - Shashikala


చెన్నై: అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీని కాపాడితీరుతానని ఆ పార్టీ బహిష్కృత నాయకు రాలు వీకే శశికళ శపథం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, విరుదునగర్‌, మదురై జిల్లాల్లో తన ఆధ్యాత్మిక పర్యటన పూర్తిగా రాజకీయ పర్యటనగా మారిందన్నారు. ప్రతిచోటా అన్నాడీఎంకే స్థానిక నాయకులు, కార్యకర్తలు తనకు ఘనస్వాగతం పలకడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామిని, విజయాపతి విశ్వామిత్ర స్వామిని, ఇలంజి కుమారస్వామిని దర్శించిన వచ్చిన తర్వాత తన మనస్సుకు ప్రశాంతత చేకూరిందని తెలిపారు. తన పర్యటనలో అన్నాడీ ఎంకే స్థానిక నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో వచ్చి, ‘పార్టీని మీరే కాపాడాలి’ అంటూ నినాదాలు చేయడం వారంతా తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని చాటిచెబుతోందని తెలిపారు. ప్రతి కార్యకర్తల కళ్ళల్లో ఎం జీఆర్‌, జయలలితను చూశానని, వారి ఆశలేమిటో అర్థం చేసుకోగలి గానన్నారు. పార్టీ శ్రేణుల కోసమే తన శేషజీవితాన్ని అంకితమిస్తున్నానని, వారి ఆశలను నెరవేర్చటమే తన ప్రధాన లక్ష్యమని శశికళ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత చెప్పినట్టు ‘ప్రజల చేతనే నేను, ప్రజల కోసమే నేను’ అనే నినాదాన్నే తారకమంత్రంగా చేసుకుని పార్టీని కాపాడేందుకు ప్రయత్నిస్తానని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2022-03-08T14:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising