ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరప్పన్ కుటుంబంలోని చివరి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-27T18:56:50+05:30

కూసా 30 ఏళ్లుగా సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే వాస్తవానికి కూసా అంత పెద్ద నేరాలేమీ చేయలేదని, వీరప్పన్‌ను పట్టుకోలేక కోపంతో కూసాపై తప్పుడు కేసులు వేసి జైలుకు పంపించారని వారికి సన్నిహిత బంధువు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఎర్రచందనం స్మగ్లర వీరప్పన్ అన్నయ్య, వారి కుటుంబంలోని చివరి వ్యక్తి అయిన కూసా మాతేయన్(76) మృతి చెందారు. రెండు దశాబ్దాల పాటు తమిళనాడు, కార్ణాటక రాష్ట్రాల భిన్న వర్గాల నుంచి అటు విమర్శలు, ఇటు ప్రశంసలు ఎదుర్కొన్న ఆయన బుధవారం తమిళనాడులోని సేలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సదరు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అనారోగ్య కారణంతో ఆయన మే 1న ఆసుపత్రిలో చేరారు. కాగా, ఆయన అంత్యక్రియలు వీరప్పన్ సమాధి పక్కనే జరగనున్నాయట. కూసాకి భార్య మరయిమ్మల్(65), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


కూసా 30 ఏళ్లుగా సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే వాస్తవానికి కూసా అంత పెద్ద నేరాలేమీ చేయలేదని, వీరప్పన్‌ను పట్టుకోలేక కోపంతో కూసాపై తప్పుడు కేసులు వేసి జైలుకు పంపించారని వారికి సన్నిహిత బంధువు ఒకరు తెలిపారు. అయితే వీరప్పన్ చేసిన నేరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూసా మద్దతు ఉన్నట్లు అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక హత్య కేసులో కూసాపై 1987లో మొదటిసారి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 1989లో కూసాని మొదటి సారి అరెస్ట్ చేశారు. కూసాకి 1997లో జీవిత ఖైదు పడింది. కాగా, కూసా సోదురుడు వీరప్పన్‌ను 2004లో తమిళనాడు, కర్ణాటకల ప్రభుత్వాలు కలిసి కొనసాగించిన జాయింట్ ఆపరేషన్‌ ద్వారా మట్టుబెట్టారు.

Updated Date - 2022-05-27T18:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising