ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral fevers: వణుకుతున్న నగరం

ABN, First Publish Date - 2022-12-07T07:49:42+05:30

నగరంలో మళ్లీ వైరల్‌, ఫ్లూ జ్వరాలు(Viral and flu fevers) పెరుగుతున్నాయి. వాటికి తోడు ఎవరిని కదిపినా జలుబు, గొంతునొప్పి సమస్యలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మళ్లీ పెరుగుతున్న వైరల్‌ జ్వరాలు

- ఎవరిని కదిపినా జలుబు, గొంతునొప్పి సమస్యే

చెన్నై, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నగరంలో మళ్లీ వైరల్‌, ఫ్లూ జ్వరాలు(Viral and flu fevers) పెరుగుతున్నాయి. వాటికి తోడు ఎవరిని కదిపినా జలుబు, గొంతునొప్పి సమస్యలతో బాధ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. గొంతు తడారిపోవటం, విపరీతమైన దగ్గుతో వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు వివిధ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో నగరవాసులు వర్షాల కారణంగా చిన్న చిన్న జ్వరాలు, జలుబు, చలికి బాధపడ్డారు. ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా నగరంలో వైరల్‌ జ్వరం కేసులు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చేవారిలో జ్వరబాధితులే అధికంగా ఉంటున్నారు. ఓ వైపు చిరు జల్లులు, మరోవైపు వేకువజామున కురుస్తున్న పొగమంచు, వణికించే చల్లటి వాతావరణంతో వైరల్‌ జ్వరాలు అధికమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వైరల్‌ జ్వరాలు రెండు మూడు రోజుల్లో తగ్గుతాయి. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న జ్వరాలు పది రోజుల వరకు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ జ్వరం తగ్గినా జలుబు, దగ్గు, చలి తగ్గకపోవటం తో ఒళ్లునొప్పులు కూడా అధికమవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా జలుబు, దగ్గు వచ్చినా ఆర్టీపీఎస్‌ పరీక్షలు చేసుకుంటున్నారు. అందులో కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడకపోయినా వైరల్‌ జ్వరం ఉన్నట్లు ఫలితాలు వస్తున్నాయి. గత వారం రోజులుగా నాలుగు నుంచి 20 యేళ్లలోపువారికే అధికంగా వైరల్‌ జ్వరాలు వస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. 20 నుంచి 60 యేళ్ల వయసు వారికి చలి కారణంగా జలుబు, దగ్గు అధికమవుతున్నాయన్నారు. చిన్నారులు, వృద్ధులు మంచుకురుస్తున్న సమయంలో ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నప్పుడు కూడా ఈస్థాయిలో వైరల్‌ జ్వరాలు వ్యాపించలేదని చెబుతున్నారు.

ఈ విషయమై రాష్ట్ర ప్రజారోగ్యశాఖ మాజీ సంచాలకులు డాక్టర్‌ కుళందైసామి మాట్లాడుతూ... కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గినప్పటికీ, మంచు, చలి కారణంగానే వైరల్‌ జ్వరాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. గొంతు నొప్పి కూడా అధికమవటం సహజమేనని, అయితే జ్వరపీడితులు మంచులో తిరగడం వల్ల జలుబు ఎక్కువవుతోందన్నారు. ప్రజలంతా మాస్కులు ధరిస్తే వైరల్‌ జ్వరాలను నిరోధించవచ్చని, సినిమా థియేటర్లు, మాల్స్‌ తదితర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఇక చిన్నారులకు లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా వేయని టీకాలను వేయాల్సిన అవసరం కూడా ఉందని, ఆ దిశగా ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని కోరారు.

Updated Date - 2022-12-07T07:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising