ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vinayaka Swamy Cave: చవితి వేడుకలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-23T16:26:56+05:30

శివగంగ జిల్లా(Sivaganga District) తిరుపత్తూరు సమీపంలో పిళ్లయార్‌పట్టిలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కర్పగ వినాయకస్వామి గుహాలయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): శివగంగ జిల్లా(Sivaganga District) తిరుపత్తూరు సమీపంలో పిళ్లయార్‌పట్టిలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కర్పగ వినాయకస్వామి గుహాలయంలో చవితి వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. పిళ్ళయార్‌పట్టి ఆలయంలో వినాయకచవితి వేడుకలు ప్రతియేటా పది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఈ వేడుకలు భక్తులు లేకుండా నిరాడంబరంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ వేడుకలను గతంలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహాకులు సన్నాహాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో చవితి వేడుకలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకులు, శైవాగమ పండితులు మూషికవాహనం చిత్రం ఉన్న పతకాన్ని ఆలయ ప్రాకారంలో మంగళవాయిద్యాల నడుమ ధ్వజస్తంభం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్ళారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు మహా హారతి నైవేద్యం సమర్పించారు. అనంతరం పిచ్చై గురుక్కల్‌, సోమేశగురుక్కల్‌ సమక్షంలో ధ్వజ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వందలాదిమంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 8.30 గంటలకు స్వామివారు సర్వాలంకరణతో మూషికవాహనంపై ఊరేగారు. ఈ నెల 27న గజముఖాసుర సంహారం, 30న రథోత్సవం అత్యంత వైభవంగా జరుగనున్నాయి. వినాయక చవితి రోజున ఉదయం ఆలయ కొలనులో వినాయక చతుర్థి తీర్థవారి జరుగుతుంది. మధ్యాహ్నం ‘ముక్కురుణి’ అనే మెగా సైజు కుడుమును స్వామివారికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అదేరాత్రి 11 గంటలకు పంచమూర్తుల ఊరేగింపు జరుగుతుంది.

Updated Date - 2022-08-23T16:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising