ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయ్ మాల్యా కేసు విచారణ గురువారానికి వాయిదా

ABN, First Publish Date - 2022-03-09T19:31:03+05:30

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా కోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా కోర్టు ధిక్కార కేసులో విచారణను సుప్రీంకోర్టు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. సీనియర్ అడ్వకేట్, అమికస్ క్యూరీ జైదీప్ గుప్తా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాను బుధవారం వేరొక కేసులో వాదనలు వినిపించవలసి ఉన్నందున వాయిదా వేయాలని గుప్తా కోరారు. 


రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి, లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు నిర్థరణ అయింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మాల్యా తన పిల్లలకు లక్షలాది రూపాయలను బదిలీ చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్థరించింది. ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017లో నిర్థరించింది. ఈ కేసులో ఆయన వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరయ్యేందుకు చిట్టచివరి అవకాశం ఇచ్చింది. మార్చి 9న హాజరుకావాలని ఫిబ్రవరి 10న ఆదేశించింది. అయితే గుప్తా విజ్ఞప్తి మేరకు ఈ కేసులో విచారణను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది. 


2021 నవంబరు 30న విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఇక ఎంత మాత్రం వేచి చూడబోమని, కోర్టు ధిక్కార వివాదంలో మాల్యాకు శిక్ష విధించే అంశాన్ని అంతిమంగా పరిశీలిస్తామని తెలిపింది. ఆయనకు విధించదగిన శిక్ష గురించి ఆయన వాదనను వినిపించేందుకు అవకాశం కల్పించింది. 


వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరయ్యేందుకు విజయ్ మాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. 2021 నవంబరు 30న జారీ చేసిన చివరి ఆదేశాల్లో నిర్దిష్టంగా ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది. అమికస్ క్యూరీ గుప్తా మాట్లాడుతూ, విజయ్ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్థరించిందన్నారు. ఆయనకు శిక్ష విధించవలసి ఉందని చెప్పారు. 


సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కోర్టు ధిక్కార కేసుల్లో న్యాయస్థానానికి ప్రత్యేక అధికార పరిధి ఉందన్నారు. మాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఆయన వినియోగించుకోలేదన్నారు. 


Updated Date - 2022-03-09T19:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising