ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధాన పరిషత్‌ సభాపతి పదవికి హొరట్టి రాజీనామా

ABN, First Publish Date - 2022-05-17T16:45:33+05:30

విధానపరిషత్‌ సభాపతి పదవికి బసవరాజహొరట్టి రాజీనామా చేశారు. సోమవారం ఆయన విధానసౌధకు చేరుకుని ఉపసభాపతికి రాజీనామా లేఖను అందించారు. పరిషత్‌ సభాపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - మరోసారి పరిషత్‌కు వస్తానని ధీమా


బెంగళూరు: విధానపరిషత్‌ సభాపతి పదవికి బసవరాజహొరట్టి రాజీనామా చేశారు. సోమవారం ఆయన విధానసౌధకు చేరుకుని ఉపసభాపతికి రాజీనామా లేఖను అందించారు. పరిషత్‌ సభాపతి స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఒకే లైనులో ముగించారు. ఏడుసార్లు ఎమ్మెల్సీగా కొనసాగిన హొ రట్టి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి దాకా జేడీఎస్ పార్టీలో కొనసాగిన ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బెంగళూరుకు వచ్చినప్పుడు కలిశారు. హొరట్టి రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ నేతలు తనను దేవెగౌడ, కుమారస్వామి కుటుంబ సభ్యుడిగా చూశారన్నారు. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సభాపతిగా అన్ని పార్టీలకు సమానంగా చూశానన్నారు. శాసనసభ్యులకు శిక్షణలిచ్చానన్నారు. సిమ్లా, ఢిల్లీలో జరిగిన పలు సభలలో పాల్గొన్నట్లు వివరించారు. ప్రస్తుతం పశ్చిమ ఉపాధ్యాయ నియోజక వర్గ పరిధిలోని టీచర్లు పార్టీ మారాలని ఒత్తిడి చేశారన్నారు. పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి పరిషత్‌కు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కావాలనే ఆశ లేదని స్పష్టం చేశారు. ఇదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్న మోహన్‌ లింబేకాయి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎంతోకాలంగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయనకు చివరి క్షణంలో హొరట్టి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. 

Updated Date - 2022-05-17T16:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising