ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీకీ ఇష్టమైన గీతాన్ని తొలగించడం బాధాకరం: చిదంబరం

ABN, First Publish Date - 2022-01-23T23:04:18+05:30

అబైడ్ విత్ మి అనేది 1847 నాటికి సంబంధించిన ఒక పాత గీతం. ఇది జాతి పిత మహాత్మగాంధీకి ఇష్టమైన గీతం. దేశం గణతంత్రం సాధించిన 1950 నాటి నుంచి ప్రతి ఏడాది నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుక బీటింగ్ ది రిట్రీట్‌ ‘అబైడ్ విత్ మి’ అనే గీతం వస్తుండగా మార్చ్‌తో పూర్తి అవుతుంది’’ అని చిదంబరం అన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ యేడాది నుంచి ‘బీటింగ్ రీట్రిట్ కార్యక్రమం’లో ‘అబైడ్ విత్ మి’ అనే గీతాన్ని తొలగించడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై పలువురు విపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీకి ఇష్టమైన ఈ గీతాన్ని తొలగించడం చాలా బాధాకరమని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. సున్నితమైన ఆలోచనలను, ప్రజలను ప్రభుత్వం నిరాశపరిచిందని ఆయన అన్నారు. స్కాట్లాండ్‌కు చెందిన ఆంగ్ల కవి, గేయకారుడు హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ ఈ గీతాన్ని 1847లో రాశారు. కాగా, 1950 నుంచి మన దేశంలో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో పాడుతున్నారు. కాగా, ఈ ఏడాది నుంచి ఈ గీతాన్ని పాడటం లేదని తాజా భారత ఆర్మీ ప్రకటించింది.


అయితే ఈ గీతం స్థానంలో ప్రముఖ రచయిత కవి ప్రదీప్ రాసిన ‘యే మేరే వతన్ కే లోగో’ అనే గీతాన్ని ఆలపించనున్నట్లు భారత ఆర్మీ ప్రకటించింది. 1962లో భారత్-చైనా యుద్ధం సందర్భంలో కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. కాగా, ఈ విషయమై చిదరంబరం స్పందిస్తూ ‘‘అబైడ్ విత్ మి అనేది 1847 నాటికి సంబంధించిన ఒక పాత గీతం. ఇది జాతి పిత మహాత్మగాంధీకి ఇష్టమైన గీతం. దేశం గణతంత్రం సాధించిన 1950 నాటి నుంచి ప్రతి ఏడాది నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుక ‘అబైడ్ విత్ మి’ అనే గీతం వస్తుండగా బీటింగ్ రిట్రీట్‌ మార్చ్‌తో పూర్తి అవుతుంది’’ అని చిదంబరం అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ పాత క్రిస్టియన్ గీతం, కేవలం క్రిస్టియన్ గీతం లాగే మిగిలిపోలేదు. ఇది సెక్యూలర్ గేయంగా అవతరించింది. కానీ ఇక నుంచి జరిగే గణతంత్ర వేడుకల్లో ఇక ఇది వినించకపోవడం బాధాకరం’’ అని అన్నారు.

Updated Date - 2022-01-23T23:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising