ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్సిటీ Exams వాయిదా

ABN, First Publish Date - 2022-01-11T13:16:10+05:30

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - మంత్రి పొన్ముడి ప్రకటన 


చెన్నై: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి అధికమవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చెన్నై సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆర్ట్స్‌ కళాశాలల్లో విద్యార్థులకు, అధ్యాపకులకు, ప్రొఫెసర్లకు కరోనా సోకి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వైద్యకళాశాలలు తప్ప తక్కిన అన్ని కళాశాలలకు ఈ నెల 20 వరకు సెలవులు ప్రకటించామన్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను కూడా ఖాళీ చేయించినట్లు చెప్పారు. గత డిసెంబర్‌లో విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు జరపాలని తొలుత నిర్ణయించామని, విద్యార్థులు, అధ్యాపకుల కోరిక ప్రకారం ఆ పరీక్షలను ఈ నెల 20 తర్వాత జరపాలని నిర్ణయించామని, అయితే ప్రస్తుతం రెండు వైరస్‌ల వ్యాప్తి తీవ్రరూపం దాల్చటంతో విద్యార్థులు, అధ్యాపకుల భద్రత దృష్ట్యా విశ్వవిద్యాలయాల్లో ఈ నెల 20 తర్వాత జరుపతలపెట్టిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నామని, ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ వారం రోజుల ముందుగా ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా పరీక్షలు జరిపే విశ్వవిద్యాలయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆధ్వర్యంలో జరిగే ప్రాక్టికల్స్‌ నిర్ణీత తేదీల్లోనే జరుగుతాయని. వాటికి తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరవు తారు కనుక ప్రాక్టికల్‌ పరీక్షలను వాయిదా వేయడం లేదని మంత్రి పొన్ముడి స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-11T13:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising