ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-07-10T14:25:04+05:30

హోటల్‌ గదులకు 12 శాతం జీఎస్టీ విధింపును వెంటనే ఉపసంహరించుకోవాలని తమిళనాడు హోటళ్ల సంఘం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై), జూలై 9: హోటల్‌ గదులకు 12 శాతం జీఎస్టీ విధింపును వెంటనే ఉపసంహరించుకోవాలని తమిళనాడు హోటళ్ల సంఘం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు వెంకటసుబ్బు, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ, 1,000 అద్దె గదులపై 12 శాతం జీఎస్టీ విధించడం సరికాదన్నారు. సాధారణంగా ఇంటర్వ్యూలు, పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, బంధువులు, వ్యాపారం నిమిత్తం వెళ్లే చిరువ్యాపారులు అధికంగా హోటళ్లలో బసచేస్తుంటారని అన్నారు. వారి వారి ఆర్థికస్తోమతను బట్టి చిన్న హోటళ్లకే వెళుతుంటారని, అలాంటి వారికి జీఎస్టీ విధింపుతో అదనపు భారం పడుతుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రిని కోరినట్లు వారు తెలిపారు.

Updated Date - 2022-07-10T14:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising