ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venkaiah comments.. సహనమే ప్రజాస్వామ్యానికి బలం: వెంకయ్య నాయుడు

ABN, First Publish Date - 2022-08-09T19:59:06+05:30

సహనమే ప్రజాస్వామ్యానికి బలమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): సహనమే ప్రజాస్వామ్యానికి బలమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఈ నెల 11న ఆయన పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమానికి హాజరై ప్రత్యేక సందేశమిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలను హర్షించే లక్షణం విపక్షాలకు ఉండాలని, ప్రతిపక్షాల వాదనలను గౌరవించే గుణం ప్రభుత్వ పక్షానికి కూడా ఉండాలని ఆయన సూచించారు. వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి తాను వైదొలగినప్పటికీ ప్రజల్లో మమేకమై పని చేస్తానని వెంకయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, నేతలు పాల్గొన్నారు.


కాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్ఫూర్తి ప్రదాత అని, ఆయన మార్గదర్శనంలో సుదీర్ఘకాలం సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ధర్మం, కర్తవ్య నిర్వహణే లక్ష్యంగా ఆయన తన భావితరాలకు మార్గదర్శనం చేశారని ప్రశంసించారు. దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి ప్రధానమంత్రిగా పార్లమెంట్‌ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకటించారు. ఉపరాష్ట్రపతిగా బుధవారం పదవీవిరమణ చేయనున్న వెంకయ్యనాయుడుకు సోమవారం రాజ్యసభలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మోదీ ప్రసంగిస్తూ.. వెంకయ్య నెలకొల్పిన ప్రమాణాల్లో ప్రజాస్వామ్య పరిపక్వతను చూశానన్నారు. వెంకయ్య చమత్కార సంభాషణలను పలు సందర్భాల్లో మోదీ గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2022-08-09T19:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising