ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vedanta-Foxconn: మా కష్టాన్ని గుజరాత్ తన్నుకుపోయింది: ఉద్ధవ్ థాకరే

ABN, First Publish Date - 2022-09-18T01:43:28+05:30

ముంబై: వేదాంత-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్రాజెక్టును మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ తన్నుకుపోవడంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వేదాంత-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్  ప్రాజెక్టు (Vedanta Foxconn semiconductor project)ను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ తన్నుకుపోవడంపై ప్రత్యర్థి పార్టీలను మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackery) తప్పుపట్టారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్రకు తీసుకు వచ్చేందుకు తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతగానో కష్టపడ్డామని శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అలాంటి ప్రాజెక్టును గుజరాత్‌ తన్నుకుపోయిందన్నారు. ఆ ప్రాజెక్టు తరలిపోవడానికి గత ప్రభుత్వమే కారణమంటూ విపక్షాలు అభాండాలు వేయడం సరికాదని చెప్పారు.



మాదే నిజమైన శివసేన...

శివసేన రాష్ట్ర యూనిట్‌ల అధ్యక్షులు 12 మంది ఏక్‌నాథ్ షిండే శిబిరంలోకి చేరడంపై అడిగిన ప్రశ్నకు థాకరే సమాధానమిస్తూ, నిజమైన శివసేనకు తానే నాయకుడినని, నాలుగు జనరేషన్లు చేసిన సామాజిక సేవ నుంచి పుట్టిన పార్టీ శివసేన అని చెప్పారు. సేనను లాక్కోవడం కానీ, కొనుగోలు చేయడం కానీ ఎప్పటికీ జరగదని చెప్పారు.


గుజరాత్ పాక్‌లో లేదు...

కాగా, గుజరాత్ ఎక్కడో పాకిస్థాన్‌లో లేదని, అది కూడా ఈ దేశంలోనే ఉందని, గుజరాత్ ప్రజలు కూడా తమ సోదరులేనని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తాజా పరిణామంపై వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-18T01:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising