Vande Bharat: ‘వందే భారత్’ రైలుకు ఘనస్వాగతం
ABN, First Publish Date - 2022-11-12T10:29:59+05:30
దక్షిణభారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైల్వేశాఖ(Department of Railways) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్’ రైలు ఇకపై రోజూ
పెరంబూర్(చెన్నై), నవంబరు 11: దక్షిణభారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైల్వేశాఖ(Department of Railways) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్’ రైలు ఇకపై రోజూ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపడంతో బయల్దేరి సాయంత్రం చెన్నై చేరుకున్న ఈ రైలుకు దక్షిణ రైల్వే అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. బెంగళూరు నుంచి బయల్దేరిన ఈ రైలు 4 స్టేషన్లలో ఆగగా అక్కడి ప్రజలు, విద్యార్థులు, రైల్వే అధికారులు ఫ్లాట్‌ఫారాలపై నిలబడి స్వాగతించారు. సాయంత్రం చెన్నై డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వందే భారత్ రైలుకు డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ హెడ్స్ జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్, చెన్నై డీఆర్‌ఎం గణేశ్, అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రయాణికులు స్వాగతం పలికారు. శనివారం నుంచి యధావిధిగా ఈ రైలు నడుస్తుందని అధికారులు తెలిపారు. తొలిరోజు బయల్దేరిన రైలులో ఎంపిక చేసిన విద్యార్థులు, రైల్వే అధికారులు ప్రయాణించారు.
Updated Date - 2022-11-12T10:30:01+05:30 IST