ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వందే భారత్‌

ABN, First Publish Date - 2022-11-12T11:27:14+05:30

దక్షిణాదికి మంజూరైన తొలి వందేభారత్‌(Vande Bharat) హైస్పీడ్‌ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైసూరు - బెంగళూరు - చెన్నై మధ్య అత్యంత వేగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదికి మంజూరైన తొలి వందేభారత్‌(Vande Bharat) హైస్పీడ్‌ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైసూరు - బెంగళూరు - చెన్నై మధ్య అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలును చూసేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. తొలిరోజు ఈ రైలు బెంగళూరు - చెన్నై మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఆగింది. బుల్లెట్‌ రైలు తరహాలో ఉన్న ఈ రైలును కొందరు తాకి సంతోషపడ్డారు. మరికొందరు రైలులోకి ఎక్కి దిగారు. ఈ మార్గంలో వందేభారత్‌ రైలు సంచారం ద్వారా ప్రయాణ సమయాన్ని రెండు గంటలపాటు తగ్గించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ఈ రైలు దోహదపడుతుందని భావిస్తున్నారు. బుధవారం మినహా వారంలో ఆరు రోజులు నడిచే ఈ రైలుకు మైసూరు, బెంగళూరు, కాట్పాడి, చెన్నైలో మాత్రమే స్టాప్‌లు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా ఈ రైలు ఆగిన అన్ని స్టేషన్లలోనూ ప్రధాని నరేంద్రమోదీకి జై అంటూ ప్రజలు నినాదాలు చేయడం విశేషం.

Updated Date - 2022-11-12T11:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising