ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నుంచి హారక్ సింగ్‌ని తీసేసింది అందుకే: సీఎం

ABN, First Publish Date - 2022-01-18T00:29:13+05:30

అయితే తనను పార్టీ నుంచి తొలగించడంపై మంత్రి హరక్ సింగ్ రావత్ మీడియా ముందు కంటతడి పెట్టారు. ఇక నుంచి తాను కాంగ్రెస్ తరఫున పనిచేస్తానని, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ మంత్రివర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి హారక్ సింగ్ రావత్‌ను తొలగించారు. అనంతరం ఆయనపై ఆరేళ్ల పాటు నిషేధం ఉంటుందని ప్రకటించారు. అయితే హారత్‌ను పార్టీ నుంచి తీసేయడంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వివరణ ఇచ్చారు. రావత్ తన కుటుంబ సభ్యులకు టికెట్లు అడిగారని, బీజేపీలో ఇలాంటి రాజకీయాలు ఉండవని అన్నారు. అయితే తన కుటుంబ సభ్యులకు టికెట్లపై పార్టీపై రావత్ ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.


అయితే తనను పార్టీ నుంచి తొలగించడంపై మంత్రి హరక్ సింగ్ రావత్ మీడియా ముందు కంటతడి పెట్టారు. ఇక నుంచి తాను కాంగ్రెస్ తరఫున పనిచేస్తానని, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. సామాన్య ప్రజానీకం సమస్యలను బీజేపీ ఎప్పుడూ పట్టించుకున్న పాపన పోలేదని, పార్టీ గురించి, పార్టీ అనుసరించే విధానం గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాను పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-18T00:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising