ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ ఎన్నికలు : 41 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

ABN, First Publish Date - 2022-01-20T17:42:54+05:30

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ 41 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది మహిళలకు స్థానం దక్కింది. ఈ ఎన్నికల కోసం ఆ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా ఇది. మొదటి జాబితాను 125 మంది అభ్యర్థుల పేర్లతో ఈ నెల 14న విడుదల చేసింది. 


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించినట్లుగానే ఈ రెండు జాబితాలలోనూ 40 శాతం మంది మహిళలకు చోటు కల్పించారు. మొదటి జాబితాలో 50 మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వగా, వీరిలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి కూడా టిక్కెట్ ఇచ్చారు. అదేవిధంగా నటి, మోడల్, ప్రస్తుతం రాజకీయ నేత అర్చన్ గౌతమ్, ఆశా వర్కర్ పూనమ్ పాండే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన సదాఫ్ జఫర్‌లకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. 




Updated Date - 2022-01-20T17:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising