ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

558 new madrasaలకు ప్రభుత్వ గ్రాంట్లు నిలిపివేత...యోగి కేబినెట్ నిర్ణయం

ABN, First Publish Date - 2022-05-18T16:37:51+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మదర్సాలకు గ్రాంట్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచనల నిర్ణయం తీసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మదర్సాలకు గ్రాంట్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచనల నిర్ణయం తీసుకుంది. యూపీలోని 558 మదర్సాలకు గ్రాంట్లు నిలిపివేసే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.మదర్సాలకు నిధులు అందించే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ విధానానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముగింపు పలికారు. యోగి కేబినెట్ ఇప్పుడు కొత్త మదర్సాలకు ఇకపై ఎలాంటి గ్రాంట్ ఇవ్వబోమని ప్రకటించింది.ప్రభుత్వం మదర్సాల పనితీరుపై విచారణకు ఆదేశించింది.యూపీ రాష్ట్రంలోని దాదాపు 16,000 నమోదిత మదర్సాలలోని 558 ఇన్‌స్టిట్యూట్‌లకు నిధులు మంజూరు చేసింది. మదర్సా ఆధునీకరణ పథకం కింద యూపీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌లో రూ. 479 కోట్లు కేటాయించింది.


రాష్ట్రంలోని మదర్సాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ తరగతులు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరి చేసిన వారంలోపు కొత్త మదర్సాలకు నిధులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వు మే 12 నుంచి అమలులోకి వచ్చింది.ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మైనారిటీ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 24వతేదీన జరిగిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2022-05-18T16:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising