ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి పంద్రాగస్ట్‌కు సెలవు రద్దు

ABN, First Publish Date - 2022-07-16T00:27:21+05:30

లక్నో: ఈ సారి పంద్రాగస్ట్‌కు విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఈ సారి పంద్రాగస్ట్‌కు విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తౌతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు యోగి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. అంతేకాదు ఆ రోజున స్వచ్ఛ భారత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడతారు. స్వాతంత్ర్య పోరాట యోధులకు సంబంధించిన స్థలాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహించడం కాకుండా ప్రజల్లో దేశభక్తిని నింపేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.


వారోత్సవాల్లో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు రూపొందించాలని యూపీ ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలందాయి. ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్ధులతో పాటు స్వచ్ఛంద సంస్థలను, వ్యాపార సంస్థలను భాగస్వాములను చేయాలని ఆదేశాల్లో సూచించారు. 

Updated Date - 2022-07-16T00:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising