ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌పై బైడెన్ అక్కసు

ABN, First Publish Date - 2022-03-22T18:13:52+05:30

ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంశంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికా మిత్ర దేశాల్లాగా, రష్యా వైఖరిని ఖండించేందుకు భారత్ భయపడుతోందని జో బైడెన్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంశంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికా మిత్ర దేశాల్లాగా, రష్యా వైఖరిని ఖండించేందుకు భారత్ భయపడుతోందని జో బైడెన్ విమర్శించారు. మరోవైపు రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికాతోపాటు నాటో, యూరోపియన్ యూనియన్‌, పలు ఆసియా దేశాలపై బైడెన్ ప్రశంసలు కురిపించారు. సోమవారం వాషింగ్టన్‌లో జరిగిన ఒక సమావేశంలో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై విమర్శలు చేశారు. ‘‘రష్యాపై ఆంక్షల విషయంలో క్వాడ్ సభ్యదేశాల్లో భారత్ భయపడుతోంది. జపాన్, ఆస్ట్రేలియాలు మాత్రం బలంగా నిలబడ్డాయి. పుతిన్ వైఖరిని ఎండగడుతున్నాయి. నాటోను విడదీయాలని పుతిన్ అనుకుంటున్నాడు. కానీ, నాటో ఇంకా ఐకమత్యంగా తయారవుతుంది’’ అని బైడెన్ అన్నారు. 


ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో నాటో, ఈయూతోపాటు కొన్ని దేశాలు రష్యా కరెన్సీని నిషేధించడంతోపాటు, ఇతర ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. భారత్ మినహా క్వాడ్ సభ్యులైన జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేశాయి. అయితే భారత్ మాత్రం ఇంకా రష్యా నుంచి  చమురు దిగుమతి చేసుకుంటూనే ఉంది. భారత్ తన చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడిందని, రష్యా నుంచి దిగుమతి చేసుకునేది ఒక్క శాతం కంటే తక్కువే అని ఇటీవల భారత్ ప్రకటించింది. 

Updated Date - 2022-03-22T18:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising