ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత-అమెరికా నేవీల మధ్య కీలక ఒప్పందం

ABN, First Publish Date - 2022-04-13T22:36:46+05:30

భారత్-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడనున్నాయి. దేశ రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడనున్నాయి. దేశ రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ అమెరికా సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌తోపాటు, రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ పరంగా కీలక ఒప్పందాలు జరిగాయి. దీని ప్రకారం అమెరికన్ యుద్ధ నౌకల నిర్వహణతోపాటు మరమ్మతులు చేసేందుకు భారత షిప్‌యార్డ్‌లను వినియోగించుకోనున్నారు. మన షిప్‌యార్డ్‌లు ఈ విషయంలో ఎంతవరకు ఉపయోగపడగలవో ముందుగా అక్కడి నిపుణులు పరిశీలిస్తారు. ఈ నిర్ణయం వల్ల భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా, మన షిప్‌యార్డ్‌లకు అదనపు వ్యాపారం జరిగే అవకాశం ఉంది. పదేళ్లుగా భారత్, అమెరికాతో రక్షణ సంబంధాల్ని మరింతగా పెంచుకుంటోంది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఇరు దేశాల నేవీకి సంబంధించి సహకారం మెరుగవుతోంది.

Updated Date - 2022-04-13T22:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising