ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indiana mallలో కాల్పులు...ముగ్గురి మృతి, ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2022-07-18T14:10:21+05:30

అమెరికా దేశంలోని ఇండియానా మాల్‌లో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్(అమెరికా): అమెరికా దేశంలోని ఇండియానా మాల్‌లో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఇండియానా స్టేట్ మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.సాయుధ పౌరుడు జరిపిన ఎదురుకాల్పుల్లో ముష్కరుడు హతమయ్యాడని అమెరికా పోలీసులు తెలిపారు. గ్రీన్‌వుడ్ పార్క్ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు గ్రీన్‌వుడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జిమ్ ఐసన్ తెలిపారు.‘‘గ్రీన్‌వుడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ శాంతిభద్రతలను పరిరక్షిస్తోంది.నేను కమాండ్ పోస్ట్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నాను, ఇక ఎలాంటి ముప్పు లేదు’’ అని మేయర్ మార్క్ మైయర్స్ చెప్పారు.


అయితే కాల్పుల వెనుక కారణమేమిటనేది ఇంకా కనుగొనలేదు. స్థానిక అత్యవసర కాల్ సెంటర్‌కు ఆదివారం రాత్రి ఫుడ్ కోర్ట్‌లో కాల్పుల గురించి సమాచారం వచ్చిందని పోలీసులు చెప్పారు.కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద పొడవాటి రైఫిల్, మందుగుండు సామగ్రికి సంబంధించిన అనేక మ్యాగజైన్లు ఉన్నాయని పోలీసు చీఫ్ జిమ్ ఐసన్ తెలిపారు.


Updated Date - 2022-07-18T14:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising