ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Monkeypox Health Emergency: యూఎస్‌లోనూ మంకీపాక్స్ హెల్త్ ఎమర్జెన్సీ

ABN, First Publish Date - 2022-08-05T14:22:38+05:30

మంకీపాక్స్(Monkeypox) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్(US Declares)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: మంకీపాక్స్(Monkeypox) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్(US Declares) శుక్రవారం  ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా (హెల్త్ ఎమర్జెన్సీ)(Health Emergency) ప్రకటించింది. మంకీపాక్స్ నివారణకు అధిక నిధులు కేటాయించడంతోపాటు వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని నిర్ణయించారు.ప్రపంచవ్యాప్తంగా 25,800 మంకీపాక్స్ కేసులు నమోదైన దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ జులై నెలలోనే మంకీపాక్స్ హెల్త్ ఎమర్జెన్సీగా(Monkeypox Health Emergency) ప్రకటించింది.మంకీపాక్స్ సోకిన రోగులకు జ్వరం, చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుండటంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. 


అమెరికా దేశంలో ఇప్పటికే 6,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.న్యూయార్క్ నగరంలో మంకీపాక్స్ కేసులు అధికంగా నమోదవడంపై యూఎస్ వైద్యాధికారులు ఆ నగరంపై దృష్టి సారించారు.ఆఫ్రికా దేశంలో మంకీపాక్స్ వైరస్ గతంలో కంటే భిన్నంగా  ప్రధానంగా లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపిస్తోంది.పురుషులు పలువురు పురుషులతో సంబంధాలు పెట్టుకుంటే మంకీపాక్స్ వచ్చే ప్రమాదముందని గుర్తించిన అమెరికా వైద్యాధికారులు హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారు.మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలని, ప్రజలు వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.మంకీపాక్స్ సోకే అవకాశమున్న రిస్క్ గ్రూపు వారికి వ్యాక్సిన్(monkeypox vaccines) అందించాలని నిర్ణయించారు.


Updated Date - 2022-08-05T14:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising