ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా గగనతలంపై రష్యా విమానాలకు నిషేధం

ABN, First Publish Date - 2022-03-03T01:09:08+05:30

రష్యాకు చెందిన విమానాలకు అమెరికా గగనతలాన్ని మూసి వేస్తున్నాం. రష్యా విమానాలను ఎంత మాత్రం అనుమతించం. రష్యా ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచి ఒంటరి చేయడానికి మా మిత్రదేశాలు చేస్తున్న ప్రయాత్నాల్లో మేము భాగస్వామ్యం అవుతామని నేను ప్రకటిస్తున్నాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాకు ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఈయూ, ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు రష్యాపై వివిధ రకాలైన ఆంక్షలు విధించాయి. ఇందులో ఒకటి తమ గగనతలం మీద నుంచి రష్యా విమానాలను నిషేధించాయి. తాజాగా అమెరికా సైతం ఈ నిర్ణయం తీసుకుంది. తమ గగనతలం నుంచి రష్యా విమానాలను అనుమతించబోమని అమెరికా అధినేత జోబైడెన్ ప్రకటించారు.


‘‘రష్యాకు చెందిన విమానాలకు అమెరికా గగనతలాన్ని మూసి వేస్తున్నాం. రష్యా విమానాలను ఎంత మాత్రం అనుమతించం. రష్యా ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచి ఒంటరి చేయడానికి మా మిత్రదేశాలు చేస్తున్న ప్రయాత్నాల్లో మేము భాగస్వామ్యం అవుతామని నేను ప్రకటిస్తున్నాను’’ అని ఐక్యరాజ్యసమితిని ఉద్దేశిస్తూ జో బైడెన్ ప్రకటించారు. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమలులోకి వస్తుందని అమెరికా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఫెడరల్ అవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

Updated Date - 2022-03-03T01:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising