ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ వ్యాక్సిన్ తిరస్కరించిన 3,300మంది సైనికుల తొలగింపు...United States Army సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-02-03T15:19:53+05:30

కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో అమెరికా ఆర్మీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో అమెరికా ఆర్మీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకాలను తిరస్కరించిన 3,300 మంది అమెరికన్ సైనికులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ నిర్ణయించింది. అమెరికా మెరైన్ కార్ప్స్, వైమానిక దళం, నేవీ దళాల్లో కొవిడ్ వ్యాక్సిన్ తిరస్కరించిన వారిని డిశ్చార్జ్ చేయాలని అమెరికన్ ఆర్మీ నిర్ణయించింది.గత వారం అమెరికన్ ఆర్మీ విడుదల చేసిన సమాచారం ప్రకారం 3,300 మందికి పైగా సైనికులు వ్యాక్సిన్ పొందడానికి నిరాకరించారు. వ్యాక్సిన్ ను తిరస్కరించిన వారిని అధికారికంగా రాతపూర్వకంగా మందలించారు. టీకాలు వేయించుకోని వారిని డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆర్మీ తెలిపింది.



పెంటగాన్ యాక్టివ్-డ్యూటీ, నేషనల్ గార్డ్, రిజర్వ్‌ల సేవ సభ్యులందరూ కొవిడ్ టీకాలు పొందాలని ఆర్మీ ఆదేశించింది, ఇది దళం యొక్క ఆరోగ్యం, సంసిద్ధతను కాపాడుకోవడంలో కీలకమని ఆర్మీ పేర్కొంది. అమెరికాలో ఒకవైపు ఒమైక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండగా, 3వేల మందికంటే అధికంగా సైనికులు కొవిడ్ టీకాను తిరస్కరించారు. అమెరికా సైనికుల్లో 97 శాతం మంది ఒక్క డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్నారు.

Updated Date - 2022-02-03T15:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising