ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లు లేకున్నా... ఉత్తమ ప్రతిభ

ABN, First Publish Date - 2022-05-31T16:53:40+05:30

దేశంలో ప్రతిష్టాత్మకమైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షల్లో కళ్లు లేకున్నా మైసూరు జిల్లాకు చెందిన మేఘన రెండోసారి ఉత్తమ ర్యాంకును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - మేఘనకు 425వ ర్యాంకు


బెంగళూరు: దేశంలో ప్రతిష్టాత్మకమైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షల్లో కళ్లు లేకున్నా మైసూరు జిల్లాకు చెందిన మేఘన రెండోసారి ఉత్తమ ర్యాంకును దక్కించుకున్నారు. మైసూరు జిల్లా పెరియపట్టణ తాలూకా కుడుకూరు గ్రామానికి చెందిన తాండవమూర్తి, నవనీత దంపతుల కుమార్తె మేఘన పూర్తిగా దృష్టి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీలో రెటీనా సమస్య ఏర్పడి 70 శాతం చూపు కోల్పోయింది. వైకల్యాన్ని అధిగమించాలనే పట్టుదలతో ఉన్న మేఘన అనుకున్నది సాధించారు. పాఠశాల, కళాశాల విద్యను బెంగళూరులోని కెంగేరిలో నివసిస్తూ పూర్తి చేశారు. 2015లో కేఏఎస్‌ పరీక్షల్లో 11వ ర్యాంకు సాధించి ట్రెజరీ విభాగంలో పనిచేస్తున్నారు. 2020లో యూపీఎస్సీ పరీక్షల్లో మేఘనకు 465వ ర్యాంకు వచ్చింది. అంతటితో సంతృప్తి చెందని మేఘన మరోసారి పట్టుదలతో పోటీపడ్డారు. 2022లో జరిగిన పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల కాగా 425వ ర్యాంకు దక్కించుకున్నారు. ర్యాంకు సాధనపై మేఘన మీడియాతో మాట్లాడుతూ చదవాలనే తలంపు ఉంటే ఏమైనా సాధ్యం చేయవచ్చునన్నారు. జాబ్‌ యాక్సెస్‌ విత్‌ స్పీచ్‌ (జాస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో చదివి పరీక్షలకు సిద్ధమైనట్టు తెలిపారు. 

Updated Date - 2022-05-31T16:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising