ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP: యోగి మంత్రికి ఏడాది జైలు

ABN, First Publish Date - 2022-08-08T21:42:47+05:30

యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో చిన్న, మధ్య తరహా సంస్థలు, ఖాదీ శాఖల మంత్రి రాకేష్ సచన్‌కు ఎదురుదెబ్బ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో చిన్న, మధ్య తరహా సంస్థలు, ఖాదీ శాఖల మంత్రి రాకేష్ సచన్‌కు (Rakesh Sachan) ఎదురుదెబ్బ తగిలింది. 1991 ఆయుధాల చట్టం కేసులో ఆయనకు కాన్పూర్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. రూ.1,500 జరిమానా కూడా వేసింది.


సచన్ ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అక్రమ ఆయుధాలకేసులో ఆయనను దోషిగా పేర్కొంటూ గత శనివారంనాడు కాన్పూర్ కోర్టు తీర్పుచెప్పింది. శిక్షను మాత్రం వాయిదా వేసింది.


కాగా, కోర్టు దోషిగా ప్రకటించి, శిక్షపై నిర్ణయం తీసుకునే లోపు  కోర్టు నుంచి సచన్ జారుకున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చుతూ, ఇవన్నీ వదంతులేనని చెప్పారు. తనపై కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 1990 దశకంలో సచన్ రాజకీయాల్లోకి వచ్చారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 1993, 2002లో ఘటంపూర్ అసెంబ్లీ స్థానంలో నెగ్గి ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఎన్నికల్లో ఫతేపూర్ లోక్‌సభ సీటు గెలిచారు.

Updated Date - 2022-08-08T21:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising