ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదాభివందనం చేసేందుకు బీజేపీ నేత ప్రయత్నం.... వారించిన ప్రధాని

ABN, First Publish Date - 2022-02-21T12:42:40+05:30

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో తన పాదాలను తాకేందుకు వంగిన బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుణపాఠం చెప్పారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్నవ్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో తన పాదాలను తాకేందుకు వంగిన బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారించారు.ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి రాగానే అతనికి బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియార్‌ శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం కటియార్ వంగి ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించారు. పాదాభివందనం చేస్తున్న కటియార్‌ను ప్రధాని మోదీ వంగి ఆపి, తన పాదాలను తాకవద్దని సంకేతాలు ఇచ్చారు.గత ఏడాది సెప్టెంబర్‌లో బీజేపీ ఉన్నవ్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అవధేష్ కతియార్ గతంలో ఉన్నావ్‌లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.ఉన్నవ్ జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్నవ్ జిల్లాలో ఫిబ్రవరి 23 వతేదీన నాలుగో దశ పోలింగ్ జరగనుంది. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ అఖిలేష్ యాదవ్ తోపాటు ప్రాంతీయ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు.


Updated Date - 2022-02-21T12:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising