ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

nitin gadkari: రాజకీయాలు వదిలేయాలని తరచూ అనిపిస్తోంది

ABN, First Publish Date - 2022-07-25T23:01:37+05:30

నాగ్‌పూర్‌: రాజకీయాలు వదిలేయాలని తరచూ అనిపిస్తోందని కేంద్ర రవాణా, ప్రధాన రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్‌: రాజకీయాలు వదిలేయాలని తరచూ అనిపిస్తోందని కేంద్ర రవాణా, ప్రధాన రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. రాజకీయాలు సామాజిక మార్పు (social change) కోసమే తప్ప అధికారమే పరమావధిగా ఉండరాదని ఆయన సూచించారు. రాజకీయాలను మించి జీవితం ఉందన్నారు. 2014లో రాజకీయాలకు స్వస్తి చెప్పి సామాజిక కార్యకర్తగా మారిన ఎన్సీపీ మాజీ ఎమ్మెల్సీ గిరీశ్ గాంధీ‌కి నాగ్‌పూర్‌లో జరిగిన సన్మాన సభలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలనేవి సామాజిక, ఆర్ధిక సంస్కరణలకు మార్గం కావాలి తప్ప అధికారం కోసం వెంపర్లాడటమే అంతిమలక్ష్యం కారాదని గడ్కరీ సూచించారు. రాజకీయాలు సమాజ అభివృద్ధి కోసం మార్గం కావాలన్నారు. విద్యాభివృద్ధి కోసం, కళల అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.    


జాతీయ రహదారుల మంత్రిగా మంచి మార్కులు తెచ్చుకున్న గడ్కరీ గాయకుడు కూడా. మిగిలిన రాజకీయ నేతల్లా కాకుండా సంగీతం, సాహిత్యంలో కూడా తనదైన ముద్ర వేశారు. తరచూ వేదికలపైన పాటలు పాడుతూ అందరినీ అలరిస్తుంటారు. గడ్కరీ వ్యాఖ్యలు మిగతా రాజకీయనాయకుల కళ్లు తెరిపిస్తాయా? nion Road Transport and Highways Minister, Nitin Gadkari, quitting politics, social change, seeking power

Updated Date - 2022-07-25T23:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising