ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై వర్షాల ప్రభావం

ABN, First Publish Date - 2022-01-12T02:15:14+05:30

నూతన పార్లమెంటు భవనం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఇటీవలి వర్షాలు ఆటంకం కలిగించాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మంగళవారం మాట్లాడుతూ, గత వారం కురిసిన వర్షాల వల్ల సెంట్రల్ విస్టా అవెన్యూ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు నిర్మాణ పనులు రెండు రోజులపాటు నిలిచిపోయినట్లు తెలిపారు. 


జనవరి 8న న్యూఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఓ దశాబ్దంలో జనవరి నెలలో ఓ రోజులో అత్యధిక వర్షపాతం రికార్డు నమోదైంది. దీనివల్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులకు రెండు రోజులపాటు ఆటంకం ఏర్పడిందని మంత్రి పురి చెప్పారు. ఆయన తన మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించేందుకు మీడియాకు వివరించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 


సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీలోని లుటియెన్స్ ఢిల్లీలో సుమారు 3.2 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేస్తారు. దీని కోసం రూ.20,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టును 2024నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాద్యతలను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టింది.


Updated Date - 2022-01-12T02:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising