ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు : IREDAకు రూ.1,500 కోట్లు

ABN, First Publish Date - 2022-01-20T02:57:54+05:30

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA)కు రూ.1,500 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. పునరుద్ధరణీయ ఇంధన రంగానికి చేయూతనిచ్చేందుకు IREDAకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. అంతేకాకుండా 3,500 నుంచి 4,000 మెగావాట్ల పునరుద్ధరణీయ ఇంధన సామర్థ్యాన్ని సృష్టించేందుకు కూడా దోహదపడుతుందన్నారు. 


భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రుణ వితరణ నిబంధనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేబినెట్ నిర్ణయం వల్ల IREDA నెట్ వర్త్ కూడా పెరుగుతుందని చెప్పారు. అదనపు పునరుద్ధరణీయ ఇంధన ఫైనాన్సింగ్‌కు దోహదపడుతుందని చెప్పారు. మినీ రత్న కంపెనీ అయిన IREDA నూతన, పునరుద్ధరణీయ ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. 


Updated Date - 2022-01-20T02:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising