ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ భూ భాగంపై భారత మిస్సైల్

ABN, First Publish Date - 2022-03-11T19:15:31+05:30

భారత్‌కు చెందిన నిరాయుధ క్షిపణి ఒకటి తమ భూభాగంపై పడిందని పాకిస్తాన్ ఆరోపించింది. బుధవారం సాయంత్రం భారత్‌లోని సిర్సా (హరియాణా) వైపు నుంచి ఒక సూపర్‌సోనిక్ క్షిపణి, పంజాబ్ ప్రాంతంలోని మియాన్ చన్ను అనే ప్రాంతంలో పడినట్లు పాక్ ఆర్మీ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌కు చెందిన నిరాయుధ క్షిపణి ఒకటి తమ భూభాగంపై పడిందని పాకిస్తాన్ ఆరోపించింది. బుధవారం సాయంత్రం భారత్‌లోని సిర్సా (హరియాణా) వైపు నుంచి ఒక సూపర్‌సోనిక్ క్షిపణి, పంజాబ్ ప్రాంతంలోని మియాన్ చన్ను అనే ప్రాంతంలో పడినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ఇది తమ దేశపు ఎయిర్‌స్పేస్ నిబంధనల ఉల్లంఘనే అని పాక్ విమర్శించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కొన్ని నివాసాలు మాత్రం ధ్వంసమయ్యాయని చెప్పింది. ఈ క్షిపణి ప్రయాణించిన మార్గం విమానాలు ప్రయాణించే మార్గమని, రెండు దేశాలకు సంబంధించిన విమానాలకు ప్రమాదం జరిగి ఉండేదని పాకిస్తాన్ రక్షణశాఖ విశ్లేషించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఏవియేషన్ సేఫ్టీ ప్రొటోకాల్‌కు విరుద్ధమని పాక్ ప్రకటించింది. అయితే, ఈ ఆరోపణలపై భారత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 

Updated Date - 2022-03-11T19:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising