ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉక్రెయిన్‌ వ్యాజ్యాల’పై హైకోర్టుల జోక్యం వద్దు

ABN, First Publish Date - 2022-03-05T07:42:44+05:30

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చే అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని, భారత ప్రభుత్వం కూడా వారిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ

17వేల మంది విద్యార్థులను తరలించాం

సుప్రీం కోర్టుకు విన్నవించిన అటార్నీ జనరల్‌


న్యూఢిల్లీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చే అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని, భారత ప్రభుత్వం కూడా వారిని తరలించే చర్యలు చేపడుతున్నందన.. హైకోర్టులు ఇందులో జోక్యం చేసుకోనవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో వచ్చే వ్యాజ్యాలను స్వీకరించవద్దని, దీనిని ఆయా కోర్టుల దృష్టికి తీసుకువెళ్లాలని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ.. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను కోరారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 17 వేల మంది భారత విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను సుప్రీంకోర్టు స్వాగతించింది. కేంద్రం కృషిని ప్రశంసించిన అత్యున్నత న్యాయస్థానం.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను తాము గుర్తించామని పేర్కొంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం ఆన్‌లైన్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఉక్రెయిన్‌లో ఇరుక్కున్న 17 వేల మంది విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించిందని, మిగిలిన వారిని తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌.. చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి గురువారం వివరించారు. తమను రొమేనియా సరిహద్దుల నుంచి తరలించాలని.. సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన బెంగళూరు వాసి, మెడిసిన్‌ విద్యార్థి ఫాతిమా అహానాతో పాటు మరికొంత మంది విద్యార్థులను అక్కడి నుంచి తీసుకువస్తున్నామని, గురువారం రాత్రి వారు ఇండియాకు చేరుకుంటారని చెప్పారు. ఇంకా ఎంత మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని సీజేఐ ప్రశ్నించగా.. గురువారం ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం.. సుమారు 7 వేల మంది ఉన్నారని అటార్నీ జనరల్‌ తెలిపారు.

Updated Date - 2022-03-05T07:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising