ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికుడి ఆత్మాహుతి

ABN, First Publish Date - 2022-02-26T18:55:03+05:30

దేశాన్ని దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు చివరివరకూ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక ఉక్రెయిన్ సైనికుడు రష్యన్ బలగాల్నిఅడ్డుకునేందుకు ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: రష్యాతో పోలిస్తే ఉక్రెనియన్ సైన్యం బలహీనమైందే అయినా, అక్కడి సైనికులు మాత్రం వీరోచితంగా పోరాడుతున్నారు. రష్యన్ బలగాల్ని అడ్డుకునేందుకు, ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. దేశాన్ని దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు చివరివరకూ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక ఉక్రెయిన్ సైనికుడు రష్యన్ బలగాల్నిఅడ్డుకునేందుకు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. రష్యా సైన్యం క్రిమియా సరిహద్దు నుంచి, ఒక బ్రిడ్జి ద్వారా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. రష్యా ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌లోని మెరైన్ బెటాలియన్‌కు చెందిన విటాలీ వోలోడిమైరోవిచ్ అనే సైనికుడు ఆ బ్రిడ్జిపై మైన్స్ అమర్చి, ఆ బ్రిడ్జిని పేల్చేశాడు. ఆ సమయంలో విటాలీ అక్కడే ఉండటంతో బ్రిడ్జితోపాటు అతడు కూడా పేలిపోయాడు. బ్రిడ్జి కూలిపోవడంతో రష్యా సైన్యానికి ట్యాంకర్లతో ఆ మార్గం ద్వారా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడం కష్టమైంది. అయితే, విటాలీ త్యాగాన్ని ఉక్రెయిన్ సైన్యం కొనియాడింది.

Updated Date - 2022-02-26T18:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising