ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా యుద్ధ ట్యాంకు ఎక్కి ఉక్రెయిన్ జెండా ఎగరేసిన పౌరుడు

ABN, First Publish Date - 2022-03-07T19:51:20+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య ప్రారంభమైన యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. రాజధాని కీవ్ సహా మరిన్ని కీలక నగరాలపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ చెమటోడుస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. బుల్లెట్లు, బాంబులతో నగరాలను శిథిలాలుగా మారుస్తోంది. అయితే రష్యా సైన్యం దాడులను ఉక్రెయిన్ బలంగానే తిప్పి కొడుతోంది. ఉక్రెయిన్ సైన్యమే కాకుండా పౌరులు కూడా రష్యా సైనికులను ప్రతిఘటిస్తున్నారు. తమ దేశంలో మీకేం పనని, వెంటనే ఇక్కడికి వెళ్లిపోవాలంటూ ఎదురు పడి నిలదీస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి రష్యా యుద్ధ ట్యాంక్ పైకి ఎక్కి ఉక్రెయిన్ జెండాను ఎగురవేశాడు. చుట్టూ జనాలు చప్పట్లు కొడుతుండగా యుద్ధ ట్యాంకుపై ఉక్రెయిన్ జెండాను రెపరెపలాడిస్తూ నినాదాలు చేశాడు.


ఉక్రెయిన్-రష్యా మధ్య ప్రారంభమైన యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. రాజధాని కీవ్ సహా మరిన్ని కీలక నగరాలపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ చెమటోడుస్తోంది. తాజాగా తాను బతికి ఉంటానో లేదో అంటూ అమెరికా ప్రతినిధులను ఉద్దేశించి అధినేత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.


రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో 38 మంది పిల్లలు మరణించారు. రష్యా సైనికుల దాడుల్లో మరో 71 మంది పిల్లలు గాయపడ్డారని ఉక్రెయిన్ పార్లమెంట్ మానవ హక్కుల కమిషనర్ లియుడ్మిలా డెనిసోవా తెలిపారు.ఖార్కివ్ మీదుగా రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసినట్లు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ తెలిపింది.న్యూయార్క్ నుంచి 50 మంది రష్యన్ దౌత్యవేత్తలు వారి కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ నగరం నుంచి మాస్కోకు తిరిగి వచ్చినట్లు రష్యా వార్తా సంస్థ నివేదించింది.

Updated Date - 2022-03-07T19:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising