ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాస ఉక్రెయినియన్ల సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-03-05T20:13:14+05:30

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పదో రోజుకు చేరుకుంది. విదేశాల్లో నివసిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పదో రోజుకు చేరుకుంది. విదేశాల్లో నివసిస్తున్న ఉక్రెయినియన్లు దేశభక్తితో తిరిగి వస్తున్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం రష్యాపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. అత్యంత సంక్లిష్ట సమయంలో తమ దేశ సైన్యానికి మద్దతుగా నిలిచి, పోరాడాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. 


ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఓలెక్సీ రెజ్నికోవ్ ఈ వివరాలను శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న 66,224 మంది ఉక్రెయినియన్లు తిరిగి స్వదేశానికి వచ్చారన్నారు. వీరంతా రష్యాపై యుద్ధంలో పాల్గొనడానికి వచ్చినట్లు తెలిపారు. శత్రు దేశం నుంచి స్వదేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో వీరంతా వచ్చారన్నారు. వీరంతా యుద్ధానికి సిద్ధమైన, ప్రేరణ పొందిన మరొక 12 బ్రిగేడ్స్ అని చెప్పారు. తాము ఉక్రెయినియన్లమని, తమకు ఎదురు లేదని చెప్పారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లోని మరియుపోల్, వోల్నోవాఖా నగరాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) పాక్షిక కాల్పుల విరమణను పాటిస్తామని రష్యా ప్రకటించింది. 


పుట్టిన రోజు జరుపుకున్న భారతీయ విద్యార్థి

ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థి కార్తిక్ పుట్టిన రోజును రొమేనియా సరిహద్దులోని శిబిరంలో శుక్రవారం జరుపుకున్నారు. 

Updated Date - 2022-03-05T20:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising