ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం: పుతిన్

ABN, First Publish Date - 2022-02-24T18:02:39+05:30

ప్రపంచ దేశాలు భయపడినంత పనైంది. ఉక్రెయిన్‌పై రష్యా సమరభేరి మోగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్: ప్రపంచ దేశాలు భయపడినంత పనైంది. ఉక్రెయిన్‌పై రష్యా సమరభేరి మోగించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌కు ఆదేశించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పుతిన్ ప్రకటించారు. ఆయన ప్రకటనతో రష్యా బలగాలు దూకుడు పెంచాయి. ఉక్రెయిన్‌పై దూసుకెళ్లేందుకు దాడులకు దిగాయి. గురువారం తెల్లవారుజామునుంచే ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఆ దేశ సరిహద్దుల్లో బాంబుల మోత మోగుతోంది.


డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ హెచ్చరించారు. ఎక్కడికక్కడ శిబిరాలు, ఆయుధాలను వదిలేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ సయితం మరింత అప్రమత్తమైంది. రష్యా దూకుడుకు ధీటుగా వ్యవహరిస్తోంది. భారీగా రిజర్వు, అదనపు బలగాలను మోహరించింది. ఉక్రెయిన్‌లో నెల రోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందు జాగ్రత్తగా ఎయిర్ స్పేస్‌ను కూడ మూసివేసింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. అలాగే వైద్య శిబిరాలను సయితం ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-02-24T18:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising