ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

80 మంది పౌరులు తలదాచుకున్న మసీదుపై రష్యా బాంబుల వర్షం: ఉక్రెయిన్

ABN, First Publish Date - 2022-03-12T21:24:31+05:30

ఉక్రెయిన్ పోర్ట్ సీటీ మరియుపోల్‌పై రష్యా బలగాలు తమ దాడులను శనివారం మరింత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్ పోర్ట్ సీటీ మరియుపోల్‌పై రష్యా బలగాలు తమ దాడులను శనివారం మరింత తీవ్రతరం చేశాయి. 80 మంది పౌరులు తలదాచుకుంటున్న మసీదుపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. పౌరులు, జనవాసాలను టార్గెట్ ‌గా చేసుకుని రష్యా దాడులు సాగిస్తోందని ఆక్రోశం వ్యక్తం చేసింది. టర్కీ పౌరులు సహా మసీదులో తలదాచుకుంటున్న వారిలో వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.


కాగా, మరియుపోల్‌లో అతిపెద్దదైన మసీదుపై రష్యా దురాక్రమణదారులు బాంబుల వర్షం కురిపించినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సుల్తాన్ సులేమాన్ ధ్రువీకరించారు. అయితే ఈ బాంబుల దాడిలో ఎంతమంది మరణించారనేది కానీ, క్షతగాత్రుల వివరాలు కానీ వెంటనే తెలియలేదు. మరియుపోల్ విడిచి వెళ్లేందుకు వీలు లేకుండా ప్రజలను రష్యా అడ్డుకుంటోందని, బ్లాకేడ్ల వద్ద వేలాది మంది పౌరులు చిక్కుకుపోయారని కూడా ఉక్రెయిన్ ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను మాస్కో తోసిపుచ్చింది. ప్రజలను తరలించడంలో ఉక్రెయిన్ విఫలమైందని, జనావాసాలను లక్ష్యంగా చేసుకుని తాము దాడులు జరుపుతున్నామనే ఆరోపణల్లోనూ నిజం లేదని చెప్పింది.

Updated Date - 2022-03-12T21:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising