ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Daddy Came Home: యుద్ధం నుంచి తిరిగొచ్చిన సైనికుని జీవితంలో భావోద్వేగ క్షణాలు

ABN, First Publish Date - 2022-07-10T16:32:11+05:30

యుద్ధం అంటేనే విధ్వంసం, వినాశనం. అలాంటి యుద్ధంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : యుద్ధం అంటేనే విధ్వంసం, వినాశనం. అలాంటి యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే సైనికుల ప్రాణాలకు వీసమెత్తు అయినా భరోసా ఉండదు. అంతటి భయానక పరిస్థితుల నుంచి ప్రాణాలతో సొంతింటికి తిరిగి రావడం గొప్ప అదృష్టమే. ఆ సైనికుల కుటుంబ సభ్యులకు సంబరమే. వారి కళ్ళలో ఆనందాన్ని వర్ణించడానికి మాటలు దొరకవు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొని, సొంతిళ్ళకు తిరిగొస్తున్న సైనికుల కుటుంబాలను ఇటువంటి భావోద్వేగ క్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ముందు వరుసలో ఉండి ఉక్రెయిన్ తరపున పోరాడి, ఇంటికి తిరిగి వెళ్ళిన ఓ సైనికుని కుటుంబ సభ్యుల స్పందనను ఉక్రెయిన్ ఇంటర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటోన్ గెరషెంకో ఓ ట్వీట్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను చూసినవారి కళ్ళు చెమర్చుతాయి, హృదయం ద్రవిస్తుంది. 


‘‘నాన్న యుద్ధం నుంచి తిరిగొచ్చారు’’ అనే శీర్షికతో ఆంటోన్ రెండు ట్వీట్లు చేశారు. ఉక్రెయిన్ సైనికుడు ఇంటికి తిరిగి వెళ్ళినపుడు తన కుటుంబ సభ్యులను ఆనందబాష్పాలతో, పుష్పగుచ్ఛాలతో పలుకరించిన తీరు అందరి మనసులను హత్తుకుంటుంది. 


ఆ సైనికుని భార్య ఆనంద బాష్పాలతో తన భర్తను ఆలింగనం చేసుకుని, అమితానందంతో స్వాగతం పలికారు. వారి పిల్లలు ఆయనకు ఆనంద బాష్పాలతో స్వాగతం పలికారు. ఆయన కుమార్తె వెక్కి వెక్కి ఏడుస్తూ, తన తండ్రిని ఆలింగనం చేసుకుంది. ఆయన తన కుమార్తెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు. 


ఈ ట్వీట్లను చూసినవారిలో చాలా మంది ఉక్రెయిన్‌కు మద్దతు పలికారు. ఓ యూజర్ చేసిన కామెంట్‌లో తన తండ్రి వియత్నాం యుద్ధంలో పాల్గొన్నప్పటి తమ ఆవేదనను తెలిపారు. తన తండ్రి ఇంటికి వచ్చేవరకు తాము ఎదురుచూసిన తీరును వివరించారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. ఉక్రెయిన్ నుంచి వేలాది మంది ప్రజలు పొరుగు దేశాలకు పారిపోయి, శరణార్థులుగా జీవిస్తున్నారు. 




Updated Date - 2022-07-10T16:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising