ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో విడత చర్చల కోసం బెలారస్-పోలండ్ సరిహద్దుకు చేరుకున్న ఉక్రెయిన్ ప్రతినిధి బృందం

ABN, First Publish Date - 2022-03-08T01:54:59+05:30

రష్యా-ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు కోసం ఉక్రెయిన్ ప్రతినిధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు కోసం ఉక్రెయిన్ ప్రతినిధి బృందం బెలారస్-పోలండ్ సరిహద్దుకు చేరుకుంది. ఇప్పటికే రెండుసార్లు జరిగిన చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.


మరోవైపు, చర్చలకు కొన్ని గంటల ముందు రష్యా  కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఆపేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.


అయితే, అందుకు తమ షరతులను అంగీకరించాల్సి ఉంటుందని, ఉక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని అన్నారు. అలా చేసే సవరణ భవిష్యత్తులో ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరకుండా అడ్డుకోగలిగేలా ఉండాలని అన్నారు. అందుకు అంగీకరిస్తే సైనిక చర్య తక్షణం నిలిచిపోతుందని స్పష్టం చేశారు.


మరోవైపు, ప్రపంచ దేశాలు కూడా మూడో విడత చర్చలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నాయి. అదే జరిగితే ఇరు దేశాల మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడుతుంది.

Updated Date - 2022-03-08T01:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising