ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ సంక్షోభం : ఐరాస భద్రతా మండలిలో కీలక తీర్మానాన్ని ప్రతిపాదించిన అమెరికా

ABN, First Publish Date - 2022-02-25T17:14:10+05:30

ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చాప్టర్ 7 తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ తీర్మానంపై ఈస్టర్న్ టైమ్ ప్రకారం 15.00 గంటలకు ఓటింగ్ జరుగుతుంది. అయితే శాశ్వత సభ్య దేశమైన రష్యా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వీటో చేస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఈ నెలలో భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో రష్యా ఉంది. 


చాప్టర్ 7 తీర్మానం ఆమోదం పొందితే, రష్యా దాడిని తిప్పికొట్టేందుకు సైనిక సామర్థ్యాన్ని వినియోగించేందుకు అవకాశం కలుగుతుంది. చాప్టర్ 6 తీర్మానం అయితే శాంతియుత పరిష్కారానికి కృషి చేయడానికి వీలు కల్పిస్తుంది. భద్రతా మండలిలో రష్యా సహా 15 దేశాలకు సభ్యత్వం ఉంది. అత్యంత కీలకమైన చాప్టర్ 7 తీర్మానానికి అనుకూలంగా రష్యా మినహా మిగిలిన దేశాలన్నీ ఓటు వేసే విధంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కృషి చేస్తున్నాయి. ఈ ఓటింగ్ నుంచి చైనా గైర్హాజరయ్యే అవకాశం ఉంది, భారత దేశం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యాను ఏకాకిని చేయడం కోసం ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని భారత్, చైనాలను అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ గట్టిగా కోరుతున్నారు. 


ఈ తీర్మానంపై రష్యా వీటో చేసే అవకాశం ఉండటంతో, దీనిని సాధారణ సభలో ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ సభలో వీటో అధికారం ఏ దేశానికీ లేదన్న సంగతి తెలిసిందే. 


UNSC ముసాయిదా తీర్మానం ఉక్రెయిన్‌పై రష్యా దాడిని కఠిన పదజాలంతో ఖండించింది. రష్యాను తిప్పికొట్టేందుకు బలగాలను ప్రయోగించేందుకు అధికారం కల్పించాలని కోరింది. ఉక్రెయిన్ నుంచి తక్షణమే వెనుకకు వెళ్ళాలని రష్యాను డిమాండ్ చేసింది. సైన్యాలను ఉక్రెయిన్ నుంచి బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ శాంతిభద్రతలను ఉల్లంఘిస్తూ రష్యా దురాక్రమణకు పాల్పడిందని ఆరోపించింది. 



Updated Date - 2022-02-25T17:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising