ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పండి

ABN, First Publish Date - 2022-03-05T14:46:46+05:30

యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. రష్యా- ఉక్రెయిన్‌ దేశాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రధాని మోదీకి వామ్‌ విజ్ఞప్తి 

- ప్యారీస్‌లో శాంతి ప్రదర్శన


ప్యారీస్‌(చెన్నై): యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. రష్యా- ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తూ వామ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్యారీస్‌ జంక్షన్‌ రాజా అన్నా మలై మండపం సమీపంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విగ్రహానికి తంగుటూరి రామకృష్ణ పూలదండ సమర్పించి నివాళులర్పించారు. అనంతరం యుద్ధం ఆపాలని, ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పాలంటూ ప్రదర్శనలో పాల్గొన్న వారు ప్ల కార్డులు ప్రదర్శించారు. యుద్ధం కారణంగా పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కాపాడడంతో పాటు వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని  తంగుటూరి రామకృష్ణ కోరారు. ఈప్రదర్శనలో త్రినాధ్‌ కుమార్‌, దేవరకొండ రాజు, వామ్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.శ్రీలత, ఉపేంద్ర, రామ్‌ప్రభు, అరుణకుమారి, శాంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T14:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising