ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానం నుంచి బాంబులు పడుతూనే ఉన్నాయి...

ABN, First Publish Date - 2022-03-09T14:33:55+05:30

ఉక్రెయిన్‌ నుంచి బాంబుల వర్షంలో తప్పించుకు వచ్చామని వేలూరు విద్యార్థిని తెలి పారు. తోటపాళ్యంకు చెందిన జయశంకర్‌ కుమార్తె దీప ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ 4వ సంవత్సరం చదువుతోంది. ఆమెతో పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - ఉక్రెయిన్‌ నుంచి వేలూరు చేరుకున్న విద్యార్థిని 


వేలూరు(చెన్నై): ఉక్రెయిన్‌ నుంచి బాంబుల వర్షంలో తప్పించుకు వచ్చామని వేలూరు విద్యార్థిని తెలిపారు. తోటపాళ్యంకు చెందిన జయశంకర్‌ కుమార్తె దీప ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ 4వ సంవత్సరం చదువుతోంది. ఆమెతో పాటు 240 మంది కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో 4వ తేది ఢిల్లీకి చేరుకొని, అక్కడి నుంచి సోమవారం ఇంటికి చేరుకున్న దీప మీడియాతో మాట్లాడుతూ, తాముంటున్న అపార్ట్‌మెంటు నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న రైల్వేస్టేషన్‌కు నడుచుకుంటూ వచ్చామన్నారు. ఆ సమయంలో రష్యా విమానాలు బాంబులు వేస్తున్నాయని, ఆ సమయంలో తాము గుంతల్లో దాక్కున్నామని తెలిపింది. అక్కడి నుంచి రైలులో ఒకరోజు ప్రయాణించి ఉక్రెయిన్‌ సరి హద్దుకు చేరుకున్నామని, అక్కడ భారత్‌ అధికారులు హంగేరీకి తీసుకెళ్లి, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి పంపారన్నారు. ఉక్రెయిన్‌ నుంచిప్రాణాలతో తిరిగొస్తామనే నమ్మకం లేదని, తాము చదువు కొనసాగించేందుకు ప్రభుత్వాలు సహకారం అందించాలని ఆమె కోరారు. కాగా, వేలూరు జిల్లా నుంచి 16 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ వెళ్లగా, వారిలో ఐదుగురు మాత్రమే స్వగ్రామాలకు చేరుకోగా, మిగిలిన 11 మంది ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2022-03-09T14:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising