ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాతో ఉద్రిక్తలు: ఎమెర్జెన్సీ ప్రకటించిన ఉక్రెయిన్‌

ABN, First Publish Date - 2022-02-24T01:14:43+05:30

మిన్క్స్ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్‌లో అధికార వికేంద్రీకరణ జరగాలి. కానీ, అందుకు ఉక్రెయిన్‌ ఒప్పుకోవడం లేదు. దీనికతోడు ఉక్రెయిన్‌ను నాటోలో చేరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇది రష్యాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు ఎమెర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం ప్రకటించింది. ఈ ఆదేశం ఉక్రెయిన్ పరిధిలోని డోనెస్క్, లుహాస్క్ సహా అన్ని టెర్రిటరీలకు వర్తింస్తుందని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యాతో ఉద్రిక్తలు ముదురుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకున్న 30 రోజుల ఎమెర్జెన్సీ నిర్ణయం, వీలైతే మరో 30 రోజులకు పెరగొచ్చని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అన్ని ఎంబసీలను, అంతర్జాతీయ కార్యాలయాలను మూసివేశారు. ఇక విమానాలు కూడా ఒకటొకటిగా రద్దు అవుతున్నాయి. ఈ నెపథ్యంలో రష్యాలో ఉన్న తమ దేశస్తులను వెనక్కి వచ్చేయాలని ఉక్రెయిన్‌ ఇప్పటికే కోరింది.


మిన్క్స్ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్‌లో అధికార వికేంద్రీకరణ జరగాలి. కానీ, అందుకు ఉక్రెయిన్‌ ఒప్పుకోవడం లేదు. దీనికతోడు ఉక్రెయిన్‌ను నాటోలో చేరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇది రష్యాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతోంది. దీంతో రష్యా దూకుడు పెంచి ఉక్రెయిన్‌లోని డోనెస్క్, లుహాస్క్ ప్రాంతాలకు రష్యా తాజాగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. వాటికి మద్దతుగా రష్యా తన బలగాలను పంపిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయబోతోందా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి.

Updated Date - 2022-02-24T01:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising