ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పదవి నుంచి అందుకే తప్పించారు: యూకే మాజీ మంత్రి నుస్రత్ ఘనీ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-01-23T23:36:33+05:30

బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై చట్ట సభ్యురాలు, మాజీ మంత్రి నుస్రత్ ఘనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ముస్లిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై చట్ట సభ్యురాలు, మాజీ మంత్రి నుస్రత్ ఘనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ముస్లిం మతాచారాల వల్ల సహచరులు ఇబ్బంది పడుతుండడంతో మంత్రి పదవి నుంచి తనను తప్పించారని సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ రవాణా మంత్రిగా ఉన్న 49 ఏళ్ల నుస్రత్ ఫిబ్రవరి 2020న మంత్రి పదవి కోల్పోయారు. తన తొలగింపులో మతం ఒక సమస్యగా మారిందన్నారు.  


నుస్రత్ ఆరోపణలపై బోరిస్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేనప్పటికీ ప్రభుత్వ చీఫ్ విప్ మార్క్ స్పెన్సర్ మాట్లాడుతూ.. నుస్రత్ తనను లక్ష్యంగా చేసుకునే ఆ ఆరోపణలు చేశారని అన్నారు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, పరువు నష్టం కలిగించేవిగా భావిస్తున్నట్టు వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. అయితే, ఆ పోస్టులు ఆ తర్వాత డిలీట్ కావడం గమనార్హం.


తనకు ఆపాదించిన అలాంటి పదాలను తానెప్పుడూ ఉపయోగించలేదని స్పెన్సర్ అన్నారు. కాగా, ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జాన్సన్ ప్రభుత్వానికి ఇప్పుడీ ఆరోపణలు మరిన్ని తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉంది. 

Updated Date - 2022-01-23T23:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising