ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెబల్ ఎమ్మెల్యేలకు Uddhav Thackeray బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-06-28T21:39:13+05:30

వసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav thackeray) కోరారు. ఒక కుటుంబ పెద్దగా రెంబల్ క్యాంప్ పట్ల తాను ఆవేదనతో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన మంగళవారంనాడు ఒక బహిరంగ లేఖ (Open letter) రాశారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గౌహతి హోటల్‌లో శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే గతవారంలో మకాం చేసినప్పటి నుంచి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే భావోద్వేగంతో కూడిన ఒక లేఖను విడుదల చేశారు.


''మీరంతా గత కొద్దిరోజులుగా గౌహతి హోటల్‌లో చిక్కుకుపోయారు. ప్రతిరోజూ మీ గురించిన ఓ కొత్త సమాచారం బయటకు వస్తోంది. చాలామందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. మనస్ఫూర్తిగా మీరంతా శివసైనికులే. మీ కుటుంబ సభ్యులు కొందరు నన్ను సంప్రదించారు. వారి భావోద్వోగాలను కూడా నాతో పంచుకున్నారు. శివసేన కుటుంబ పెద్దగా మీ అందరి మనోభావాల పట్ల నాకు గౌరవం ఉంది'' అని ఆ లేఖలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. రెబల్ క్యాంప్ నాయకుడిగా చెప్పుకుంటున్న ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా ఉద్ధవ్ ప్రస్తావిస్తూ, ఎవరో చేసిన పొరపాటుకు వారి వలలో చిక్కుకోవద్దని రెబల్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. శివసేన ఇచ్చిన గౌరవం ఇంకెక్కడా దొరకదని,  మీరు ముందుకు వచ్చి, మాట్లాడితే, మార్గం సుగమమవుతుందని ఆయన సూచించారు.


''గందరగోళానికి స్వస్తి చెప్పండి. తప్పనిసరిగా దీనికొక పరిష్కార మార్గం ఉంది. మనం కలిసి మాట్లాడుకుందాం. ఒక అవగాహనకు వద్దాం. శివసేన పార్టీ చీఫ్‌గా, కుటుంబ పెద్దగా ఇప్పటికీ మీ గురించి ఆవేదన చెందుతున్నాను. ముందుకు రండి, పరిశీలించండి, హాయిగా ఉండండి'' అని ఉద్ధవ్ ఆ లేఖలో రెబల్ ఎమ్మెల్యేలకు సూచించారు.

Updated Date - 2022-06-28T21:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising